Rayachoti: నూతన పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి!
Rayachoti: నూతన పింఛన్ల దరఖాస్తుకు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగిమళ్ళ రంగారెడ్డి డిమాండ్.
Rayachoti: నూతన పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి!
Rayachoti: పింఛను దారులు కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గడువు ప్రకటించిందని,అయితే నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమకూర్చుకోవడంలో కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తులకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం ఆయన రాయచోటి పట్టణంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పింఛన్ల దరఖాస్తులకు నెలాఖరు వరకు సమయం కేటాయిస్తే అర్హులైన ప్రతిఒక్కరూ తమకు సంబంధించిన కేటగిరీ ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమకూర్చుకుని పింఛన్లు మంజూరు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
దివ్యాంగులు,వితంతువులు,వృద్ధులు తదితర కేటగిరీలకు చెందిన పింఛనుదారులు తమ అర్హతలను నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు,రేషన్ కార్డు తదితర అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.అలాగే తమకు వర్తించే కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ గ్రూపులో నమోదు చేసుకుని,అవసరమైన పత్రాలను అధికారులకు సమర్పించి పింఛన్ మంజూరు చేయించుకోవాలని తెలిపారు.
పింఛనుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తులకు ఈనెలాఖరు వరకు గడువును పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అవకాశం కల్పించి పింఛన్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.పింఛనుదారుల సమస్యను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గడువు పొడిగిస్తే అర్హులందరికీ ప్రయోజనం చేకూరుతుందని రంగారెడ్డి సూచించారు.




