Annamayya: పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ఆటో!

Annamayya: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం యుఎన్‌ఆర్ సర్కిల్ వద్ద పాల ఆటో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో సుధాకర్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు.

MAHESH, PUNGANOOR
Published on: 28 Aug 2026 9:56 AM IST
Annamayya
X

Annamayya: పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ఆటో!

Annamayya: పుంగనూరు మండలం యు ఎన్ ఆర్ సర్కిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపల్లి గ్రామానికి చెందిన కే. సుధాకర్ (35) ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన పాలుఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story