Annamayya: గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు!

Annamayya: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో గ్రామాల్లో పోలీసుల ముఖాముఖి. గంజాయి, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళా రక్షణపై ప్రజలకు విస్తృత అవగాహన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 July 2026 7:07 AM IST
Annamayya
X

Annamayya: గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు!

Annamayya: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలపై నేరుగా చర్చించడంతో పాటు పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ముఖ్యంగా యువతను పక్కదారి పట్టిస్తున్న గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రత్యేక సూచనలు చేశారు. వాటితో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రహదారి భద్రతా నియమాలు, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని, మహిళల రక్షణ మరియు పోక్సో చట్టంపై ప్రజలకు వివరించారు. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story