Galiveedu: గాలివీడులో జూద స్థావరంపై పోలీసుల దాడి – 6గురు అరెస్ట్
Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి. ఆరుగురు అరెస్ట్, రూ. 40,300 నగదుతో పాటు బైకులు, ఫోన్లు స్వాధీనం.
Galiveedu: గాలివీడులో జూద స్థావరంపై పోలీసుల దాడి – 6గురు అరెస్ట్
గాలివీడు: గాలివీడు మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ జూద స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
గాలివీడు మండలం ఎస్ ఐ నరసింహ రెడ్డి తెలిపిన వివరాల మేరకు దానం రెడ్డిగారి పల్లి గ్రామానికి దక్షిణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న చీకి చెట్ల వద్ద కొందరు వ్యక్తులు డబ్బులు పణంగా పెట్టి 'మంగతాయ్' అనే జూదం ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించి, జూదం ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు.
ఈ దాడిలో జూదం ఆడుతున్న మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 40,300 నగదుతో పాటు, 6 సెల్‌ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.గ్రామాల్లో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.




