Chinnamandem: చిన్నమండెం విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల్లో మంత్రి

Chinnamandem: చిన్నమండెం పడమటి కోనలో శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 July 2026 4:52 PM IST
Chinnamandem
X

Chinnamandem: చిన్నమండెం విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల్లో మంత్రి

చిన్నమండెం: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం (బోరెడ్డిగారిపల్లి)లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తన సతీమణి శ్రీమతి హరితమ్మ గారు, కుమారుడు నిశ్చల నాగిరెడ్డి గారితో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి కుటుంబం భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఉత్సవాలకు విచ్చేసిన గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువతతో మంత్రి గారు ఆప్యాయంగా పలకరించి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు మంత్రి కుటుంబానికి ఘన స్వాగతం పలికి, ఆశీర్వాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రిగారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, వేదపండితులు, మహిళలు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story