Galiveedu: గాలివీడులో రైస్ మిల్ యజమాని కారు ధ్వంసం!

Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడులో భూ వివాదం కారణంగా రైస్ మిల్ యజమాని జీవి శ్రీనివాసులు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 8 July 2026 8:17 AM IST
Galiveedu
X

Galiveedu: గాలివీడులో రైస్ మిల్ యజమాని కారు ధ్వంసం!

Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడులో రైస్ మిల్ యజమాని జీవి శ్రీనివాసులు కు చెందిన కారు పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న యజమాని శ్రీనివాసులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ దాడి ఘటన వెనక గాలివీడు కు చెందిన నిమ్మకాయల భాస్కర్ రెడ్డి, చెక్క రామాంజులు, కేడం రామాంజులు, స్టాంపుల రమణా రెడ్డి ల ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు శ్రీనివాసులు మీడియా ఎదుట వాపోయారు.

తనకు, తన కుటుంబానికి ఈ నలుగురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు పోలీసులు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. శ్రీనివాసులు కు, నిమ్మకాయల భాస్కర్ రెడ్డి, చెక్క రామాంజులు, కేడం రామాంజులు, స్టాంపుల రమణా రెడ్డి ల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం నడుస్తోంది. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని బాధితుడు ఆరోపిస్తున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story