Rayachoti: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన అన్నమయ్య జిల్లా నేతలు

Rayachoti: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Srinivasulu, Madanapalle
Published on: 23 May 2026 2:15 PM IST
Rayachoti
X

Rayachoti: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన అన్నమయ్య జిల్లా నేతలు

రాయచోటి: అన్నమయ్య జిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రి కోళ్లు రవీంద్ర ను శనివారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భాగస్వామ్యం, నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బోయ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, తెలుగుయువత నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఉమేష్ బోనాల, ముత్యాల సాయికిరణ్, హర్షవర్ధన్ పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో భేటీ కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుండాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story