Boyakonda: బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీ హోమం!

Boyakonda: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ చండీ హోమం వైభవంగా నిర్వహించారు.

MAHESH, PUNGANOOR
Published on: 27 Aug 2026 7:03 PM IST
Boyakonda
X

Boyakonda: బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీ హోమం!

బోయకొండ: భక్తుల కొంగుబంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం లో పౌర్ణమి సందర్భంగా గురువారం చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో చండీ హోమం శాస్త్రోక్తంగా సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. హోమంలో పలువురు దంపతులు పాల్గొని తమ అభీష్ట సిద్ధి కొరకు ప్రత్యేక పూజలు చేసి, హోమగుండంలో ఆహుతులు సమర్పించారు.

హోమంలో పాల్గొన్న దంపతులకు దేవస్థాన ఉప కమీషనరు కార్యనిర్వహణాధికారి ఏకాంబరం అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. పూజల అనంతరం వారికి ఆలయ తీర్థప్రసాదాలను అందజేశారు. పౌర్ణమి కావడంతో బోయకొండ గంగమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story