Annamayya: బళ్లారి రాఘవ ఆశయాలు యువతకు మార్గదర్శకం: JC శివ్ నారాయణ శర్మ
Annamayya: అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో బళ్లారి రాఘవ 146వ జయంతి వేడుకలు. నాటక రంగానికి ఆయన సేవలు ఆదర్శనీయమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ కొనియాడారు.
Annamayya: బళ్లారి రాఘవ ఆశయాలు యువతకు మార్గదర్శకం: JC శివ్ నారాయణ శర్మ
బళ్లారి రాఘవ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకం: జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ
అన్నమయ్య జిల్లా, ఆగస్టు 2: తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడు బళ్లారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో యువజన సర్వీసుల శాఖ, స్టెప్, జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 146వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ వెంకటేశు జ్యోతి ప్రజ్వలన చేసి బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, బళ్లారి రాఘవ అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు అని, నాటక రంగంలో తన అసాధారణ ప్రతిభతో తెలుగు కళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. కళను సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచి సమాజ సంస్కరణ కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. మహిళలను నాటక రంగంలోకి ప్రోత్సహించడమే కాకుండా, దళితుల అభ్యున్నతికి కూడా విశేషంగా సేవలందించారని చెప్పారు. డీఆర్ఓ వెంకటేశు మాట్లాడుతూ, బళ్లారి రాఘవ నాటక కళను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు వేదికగా ఉపయోగించారని అన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. యువత మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, యువజన సర్వీసుల శాఖ పర్యవేక్షణ అధికారి వి.వి. నారాయణ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.




