Rayachoti: చిట్లూరులో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిట్లూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సంక్షేమ పథకాల వివరణ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Aug 2026 2:37 PM IST
Rayachoti
X

Rayachoti: చిట్లూరులో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన మంత్రి గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story