Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ నిశాంత్ కుమార్. జిల్లా సకల శుభాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్ష.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 5:47 PM IST
Rayachoti
X

Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు!

Rayachoti: "వినాయక చవితి" పర్వదినం సందర్భంగా సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే ఆ మహా గణపతి జిల్లా ప్రజలందరికీ పరిపూర్ణమైన ఆయుఃరారోగ్యాలను, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు జిల్లాపై ఎల్లవేళలా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలకు హృదయ పూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన భక్తి పూర్వకమైన పండుగ. ఆ మహాగణాధిపతి ప్రతి ఒక్కరి విఘ్నాలను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని అందించాలని.. జిల్లా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI