Mydukur: పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు విడుదల చేయాలి కలెక్టర్‌కు వినతి!

Mydukur: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తాగు, సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 17 Aug 2026 6:26 PM IST
Mydukur
X

Mydukur: పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు విడుదల చేయాలి కలెక్టర్‌కు వినతి!

మైదుకూరు దువ్వూరు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తక్షణం త్రాగునీటి తోపాటు పంటల సాగుకు వెంటనే నీరు విడుదల చేయాలని అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి సోమవారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు .

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లాలో ఖరీఫ్ లో సాగుకు కావలసిన పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడో కొంత బోర్ల కింద మాత్రమే పంటలు సాగు చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు అయినా తగినంత వర్షపాతం లేకపోవడంతో ఆ పంటలు కూడా వేయలేని పరిస్థితి దాపురించింది. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా అడుగంటి పోయింది.

ప్రస్తుతం రిజర్వాయర్లలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీటితో నిండే రిజర్వాయర్లు గోరకల్లు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్, వామి కొండ రిజర్వాయర్, సర్వరాయ సాగర్, చిత్రావతి, పైడిపాలెం మైలవరం రిజర్వాయర్, వెలుగోడు, తెలుగు గంగా డ్యామ్ ,బ్రహ్మం సాగర్,లకునీరు విడుదల చేసి రాయలసీమ ప్రజలకు త్రాగునీటికి , రైతులు పంటలు సాగు చేసేందుకు నీరు ఇచ్చి ఆదుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా ఉపాధ్యక్షలు ఏ. వి.భాస్కర్ రెడ్డి, సభ్యులు ఎల్. విజయ్ భాస్కర్ రెడ్డి, కామాక్షి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story