Badvel: రెండు సంవత్సరాలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఊసే లేదు : ఏఐవైఎఫ్ డిమాండ్

Badvel: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతి ఊసే లేదని ఏఐవైఎఫ్ మండిపడింది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 22 Jun 2026 1:41 PM IST
Badvel
X

Badvel: రెండు సంవత్సరాలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఊసే లేదు : ఏఐవైఎఫ్ డిమాండ్

Badvel: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఈ రెండేళ్లలో ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు మునిరత్నం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సోమవారం బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించారు శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేనిపక్షంలో నిరుద్యోగ యువతకు నెలకు ₹ 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి యువతను మోసం చేశారని అన్నారు.

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ పారదర్శకంగా జరపాలని అన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలని వారి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లేమి కారణంగా యువత ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story