Badvel: బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం!
Badvel: బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ స్టోర్ల దోపిడీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం. కాలంచెల్లిన మందులు విక్రయిస్తున్నా పట్టించుకోని అధికారులపై మండిపాటు.
Badvel: బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం!
Badvel: బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్స్ సెంటర్లు, మెడికల్ స్టోర్లు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుళ్లపల్లి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్లు, విపరీతమైన దోపిడీ చేస్తున్న, నకిలీ మందులు విక్రయిస్తున్న, ఎక్స్పైరీ అయిపోయిన మందులు విక్రయిస్తున్న వైద్యశాఖ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చోద్యం చూస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఈమధ్య కాలంలో ప్రైవేట్ హాస్పిటల్లు మెడికల్ స్టోర్లు ప్రజల నుండి విపరీతంగా దోపిడీ చేస్తున్న ఎక్స్పైరీ మందులు అమ్ముతున్న ఇదేమని అడుగుతున్నా పేషెంట్లను అగౌరవంగా మాట్లాడుతూ తయారు చేసిన కంపెనీని అడగండి అంటూ వ్యక్తి చనిపోతే వచ్చే మాట్లాడండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారి పైన వైద్యశాఖ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
బద్వేలు పట్టణంలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్ ల పైన తనిఖీలు చేసి చర్యలు తీసుకొని డాక్టర్ల పైన, ఫార్మసిస్టులు లేకుండా అద్దె ఫార్మసిస్టు సర్టిఫికెట్లతో నడుస్తున్న మెడికల్ స్టోర్ ల పైన చర్యలు తీసుకొని అటువంటి సంస్థలను సీజ్ చేసి నడుపుతున్న డాక్టర్లను మెడికల్ స్టోర్ల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి వైద్యశాఖ అధికారులకు వినతిపత్రాల ద్వారా వార్త పత్రికల ద్వారా సమాచారమిచ్చినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనుమతులు లేని హాస్పిటల్లు మెడికల్ స్టోర్లు డయాగ్నస్టిక్ సెంటర్ల లిస్ట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలమయ్యారని ఆయన అన్నారు.
ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల హాస్పిటల్లోకి వెళితే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుందని ఆయన ఆరోపించారు. తక్షణమే జిల్లా వైద్యశాఖ అధికారులు డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రతి ఒక్క హాస్పిటల్ డయాగ్నస్టిక్ సెంటర్ మెడికల్ స్టోర్ లపై తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా మరియు ఓపీల పేరుతో ఎక్కువ డబ్బులు చేస్తున్న హాస్పిటల్లపై ఫార్మాసిస్టు లేకుండా అద్దె సర్టిఫికెట్లతో నడుస్తున్న మెడికల్ స్టోర్ లపై నోటీస్ బోర్డులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకొని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.




