Mydukuru: ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద వరి వద్దన్న మైదుకూరు ఏవో!

Mydukuru: ఖరీఫ్ సీజన్‌లో కేసీ కెనాల్ కింద వరి సాగు చేయరాదని గుడిపాడు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో దువ్వూరు మండల వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Aug 2026 12:49 PM IST
Mydukuru
X

Mydukuru: ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద వరి వద్దన్న మైదుకూరు ఏవో!

Mydukuru: గుడిపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పాల్గొని రైతులకు ఖరీఫ్ సీజన్లో కేసీ కెనాల్ కింద వరి సాగు చేయరాదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఖరీఫ్ కి నీరు అందించమని తెలియజేశారని ఇప్పటికే సంబంధిత కేసీ కెనాల ఆయకట్టు డి ఈ గారు కూడా తెలియజేశారని కావున రైతులందరూ గమనించి వరి సాగు చేయరాదని కొంతమంది రైతులు వరి సాగు చేయుటకు విత్తన ఒడ్లు తెచ్చుకొని నారుమడి కి సిద్ధమవుతున్నారని కావున రైతుల అప్రమత్తమై ఖరీఫ్ సీజన్లో కేసీ కెనాల్ కింద వరి సాగు చేయరాదని తెలియజేశారు.

బోర్ల కింద వరి సాగే చేసే రైతుల కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల అరతడి పంటలు అయినా మినుము పెసర కంది జొన్న పంటలను సాగు చేసుకోవాలని తెలియజేశారు ప్రతి భూమి కలిగిన రైతు ఫార్మర్ ఐడి అనగా విశిష్ట సంఖ్య కలిగి ఉండాలని ప్రభుత్వ పథకాలు అందాలన్నా మండల బీమా చేసుకోవాలా అన్న పంట ఉత్పత్తులు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల అమ్మానాన్న ఈ ఫార్మర్ ఐడియా అనేది తప్పక ఉండాలని తెలియజేశారు ఖరీఫ్లో సాగు చేసిన పంటలు తప్పకుండా ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని అలా చేస్తేనే బీమా చేసుకున్న రైతులకు బీమా వర్తిస్తుందని తెలియజేశారు.

వరి,మినుము జొన్న,పసుపు ఉల్లి కంది ఖరీఫ్ లో సాగు చేసిన పంటలకు ఆగస్టు 15వ తారీకు చివరి తేదీ పంటల బీమా నమోదు చేసుకునే దానికని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు గ్రామ ఉద్యాన సహాయకురాలు రైతులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story