Proddatur: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తిరుగుబాటు: రాచమల్లు!

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ అమృత్‌నగర్‌లో 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Aug 2026 4:33 PM IST
Proddatur
X

Proddatur: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తిరుగుబాటు: రాచమల్లు!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీ అమృత్‌నగర్‌లో టిడిపి నుండి వైసీపీ లోకి 50 కుటుంబాలు చేరికలు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలపై ప్రజలు తిరగబడుతున్నారు అన్నారు. నేడు కొత్తపల్లె పంచాయతీ అమృత్‌నగర్‌లో ఖాదర్ బాషా కుమారుడు నూర్ బాషా నాయకత్వంలో ఏకంగా 50 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీ లోకి చేరారు.​ అమృత్‌నగర్ ప్రాంతం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను మూడుసార్లు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే, మూడూ సార్లూ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీ ఇచ్చారు.

2006లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ అమృత్‌నగర్‌ను స్థాపించారు. ఈ రోజూ నేను సవాల్ చేస్తున్నా... ఇన్ని రోజులు పాలించిన ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా చర్చకు సిద్ధమా..వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ₹15 కోట్లతో 72 రోడ్లు, 2 ప్రధాన కాలువలు నిర్మించాం. నాగాయపల్లె నది నుంచి ₹70 లక్షలతో అమృత్‌నగర్‌కు మంచి నీటి పథకం తెచ్చాం. సచివాలయ వ్యవస్థతో పరిపాలనను ఇంటింటికీ తెచ్చింది మేం కాదా.. టిడిపి హయాంలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా..కూటమి ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే ప్రజలకు నరకం చూపిస్తోందని రాచమల్లు ధ్వజమెత్తారు.

మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లుల భారం మోపారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు! ​ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా పేద ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా టిడిపి నాయకులు ఇంటింటి కార్యక్రమం అంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. హామీలపై సమాధానం చెప్పలేక, ప్రజలకు తమ ముఖాలను చూపించకుండా తప్పించుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆపేది లేదని, వైసీపీ ఎప్పుడూ అమృత్‌నగర్ ప్రజలకు అండగా ఉంటుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 50 కుటుంబాల చేరికతో కొత్తపల్లె పంచాయతీలో వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నిండింది రచమల్లు అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాతకోట వంశీధర్ రెడ్డి, వరికుంట్ల ఓబుల్ రెడ్డి, వైసిపి నాయకులు కల్లూరు నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story