Rayachoti: గాలివీడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పలువురు నాయకులు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి.
Rayachoti: గాలివీడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పలువురు నాయకులు!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
అరవీడు గ్రామం శ్రీనగర్‌కు చెందిన నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు, మలసానివారిపల్లికి చెందిన సుబ్బారెడ్డి, భాస్కర్‌రెడ్డి, నూలివీడుకు చెందిన వెంకట్రామిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, అలాగే గరుగుపల్లి, గుండ్లచెరువు గ్రామాలకు చెందిన మొత్తం 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, గ్రామీణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ బలమని, ప్రజల విశ్వాసమే తెలుగుదేశం పార్టీకి నిజమైన శక్తి అని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, బాధ్యతలు ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




