Ichchapuram: ఏబీఎన్ రాధాకృష్ణపై ఇచ్చాపురంలో పోలీసులకు ఫిర్యాదు
Ichchapuram: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఇచ్చాపురంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Ichchapuram: ఏబీఎన్ రాధాకృష్ణపై ఇచ్చాపురంలో పోలీసులకు ఫిర్యాదు
ఇచ్చాపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇచ్చాపురం సమన్వయకర్త సాడి సాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నర్తు రామారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 04-04-2026న ABN Andhra Jyothyలో ప్రసారమైన “వీకెండ్” విత్ ఆర్ కె కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత, అనాదరణ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిని యూట్యూబ్ ద్వారా చూసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Next Story


