Kadapa: వైసీపీపై విషం చిమ్ముతున్నారు.. ఆర్కేపై చర్యలు తీసుకోవాల్సిందే!

Kadapa: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 12:59 PM IST
Kadapa
X

Kadapa: వైసీపీపై విషం చిమ్ముతున్నారు.. ఆర్కేపై చర్యలు తీసుకోవాల్సిందే!

కడప జిల్లా మైదుకూరు: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. భారీ సంఖ్యలో అనుచరులు, వైసీపీ శ్రేణులతో కలిసి మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన, సిఐ రమణారెడ్డికి ఫిర్యాదు అందజేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్ల రాధాకృష్ణ తన మీడియా సంస్థల ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రఘురామిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన వార్తలతో వైఎస్సార్‌సీపీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ ఏజెంట్‌లా పనిచేస్తున్నారు. నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తూ వైసీపీపై విషం చిమ్ముతున్నారు.""అడ్డగోలుగా వార్తలు రాస్తూ, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story