Eluru: గ్యాస్ కష్టాలకు ఇంజిన్ ఆయిల్ చెక్!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన వెల్డింగ్ వర్కర్ కరుణామయుడు వినూత్నంగా వ్యర్థ ఇంజిన్ ఆయిల్‌తో నడిచే పొయ్యిని తయారు చేశారు.
Eluru: గ్యాస్ కష్టాలకు ఇంజిన్ ఆయిల్ చెక్!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండల పరిధిలోని అల్లూరినగర్ కు చెందిన వెల్డింగ్ వర్కర్ కాళ్ల కరుణామయుడు వాహనాల నుంచి తీసేసిన వ్యర్థ ఇంజిన్ ఆయిల్తో మండే పొయ్యిని తయారుచేశారు. గ్యాస్ సిలిండర్లు దొరకపోవడం, గ్యాస్ సిలిండర్ ధరలు మరో పక్క పెరిగి హోటళ్ల నిర్వాహకులు మూసేసి ఇబ్బందులు పడుతున్నా వారికి ప్రస్తుత కాలంలో వ్యర్థ ఆయిల్ పొయ్యిలు ప్రత్యామ్నాయంగా మారాయి. చిన్నపాటి విద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ వైపు.. మరో వైపు ఇంజిన్ ఆయిల్ చుక్కలు పొయ్యి దగ్గరకు పంపి, అక్కడ రెండు బొగ్గులు పెట్టి వెలిగించడం ద్వారా మంట వచ్చేలా దీనిని రూపొందించారు.
అవసరాన్ని బట్టి మంట హెచ్చుతగ్గులు చేసుకునే వీలుంది. ఒక లీటరు వృథా ఇంజిన్ ఆయిల్తో రెండు గంటలపాటు పొయ్యి మండుతుందని, ఖర్చు తగ్గించేందుకు వ్యర్థ ఆయిల్ మండే పొయ్యిలను తయారు చేసినట్లు కరుణామయుడు తెలిపారు. దీని తయారీకి సుమారు రూ.7 వేల వరకు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు.బుట్టాయగూడెం,జంగారెడ్డిగూడెం,అశ్వారావుపేట హోటళ్ల నిర్వాహకులు సైతం తయారీకి ఆర్డర్లు ఇవ్వడం విశేషం.




