Nellore: దామరమడుగులో క్రికెట్ జాతర.. ఎంపీ వేమిరెడ్డి బర్త్ డే గిఫ్ట్ ఇది!

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ డే స్పెషల్.. దామరమడుగులో పార్లమెంటరీ స్థాయి క్రికెట్ పోటీలు. ఉచిత ప్రవేశం, లక్ష రూపాయల ప్రైజ్ మనీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 10:02 AM IST
Nellore
X

Nellore: దామరమడుగులో క్రికెట్ జాతర.. ఎంపీ వేమిరెడ్డి బర్త్ డే గిఫ్ట్ ఇది!

Nellore: బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు లో ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పార్లమెంటరీ స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ పోటీలు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని నెల్లూరు పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. నెల్లూరు పార్లమెంటరీ స్థాయి లో జరిగే ఈ పోటీలకు ఎలాంటి రుసుము చెల్లించి అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 75000 మూడో బహుమతిగా 50,000 నాలుగవ బహుమతిగా 25000 వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన బ్యాట్స్మెన్ కు కన్సలేషన్ బహుమతిగా 10000, అలాగే బౌలర్ కు పదివేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరియు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షులు జగదీష్,సూర్య, టిడిపి యూత్ విభాగం పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story