Vizianagaram: చట్టబద్ధంగా అమరావతి.. పండగ చేసుకుంటున్న గజపతినగరం టీడీపీ శ్రేణులు!
Vizianagaram: రాజధానిగా అమరావతి ఖరారు.. విజయనగరం జిల్లాలో హర్షాతిరేకాలు. చారిత్రాత్మక విజయం అంటూ గంట్యాడ మండలం నేతల దీపోత్సవం.
Vizianagaram: చట్టబద్ధంగా అమరావతి.. పండగ చేసుకుంటున్న గజపతినగరం టీడీపీ శ్రేణులు!
విజయనగరం జిల్లా: గజపతినగరం ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై విజయనగరంలో టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శనివారం రాత్రి గజపతినగరం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించాయి.
ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మాట్లాడుతూ..
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం చారిత్రాత్మక విజయం అంటూ సంబరాలు చేసుకున్నారు. అమరావతి.. అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాజధాని కల సాకారమైందంటూ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, గంట్యాడ మండలం మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, తాటిపూడి చైర్మన్ జగన్నాథం, క్లస్టర్ ఇన్‌చార్జ్ రంధి చిన్న రాము నాయుడు, క్లస్టర్స్ నంబూరి రాజేష్, రామ, కుమార్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.




