Nellore: రోడ్డుపైనే వాహనాల పార్కింగ్.. ప్రశ్నిస్తే యజమానులతో వాగ్వాదం!

Nellore: ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ సమస్య తీవ్రమైంది.

M Satya Peter, Atmakur
Published on: 13 April 2026 11:41 AM IST
Nellore
X

Nellore: రోడ్డుపైనే వాహనాల పార్కింగ్.. ప్రశ్నిస్తే యజమానులతో వాగ్వాదం!

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఓ కమర్షియల్ కాంప్లెక్స నిర్మించారు. ఆ కాంప్లెక్స్ లో రెండు ప్రధాన బ్యాంకులు ఉండడంతో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కాంప్లెక్స్ పక్కనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్ళు ప్రధాన రహదారి ఉన్నప్పటికీ బ్యాంకు వచ్చే కస్టమర్లు రహదారిలోనే వాహనాలు పార్కింగ్ చేస్తూ తమ బ్యాంకు కార్యకలాపాలు చేసుకుంటుంటారు. ఆ రహదారిలో వెళ్లాల్సిన వాహన చోదకులు వెళ్లేందుకు వీలు లేక ఎటు చూసినా వాహనాలే నిలిపి ఉండడంతో కొంతసేపు వేచి చూసిన వాహనచోదకులు పలువురు ప్రశ్నిస్తే మేము బ్యాంకుకు వచ్చాము. ఇక్కడ పార్కింగ్ స్థలం లేకనే బ్యాంకు ముందు ఖాళీ స్థలంలో నిలుపుతున్నాము. మీకు వీలైతే కాంప్లెక్స్ యజమానులను ప్రశ్నించండి అని వాగ్వాదానికి దిగుతున్నారు.గత్యంతరం లేక అటు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కమర్షియల్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న రహదారిలో వాహనాలు ఆపకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story