Karimnagar: ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.. కమిటీ ఏర్పాటుకు విజ్ఞప్తి
Karimnagar: జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని టీజెఎస్ నాయకులు భానుచందర్, స్రవంతి డిమాండ్ చేశారు.
Karimnagar: ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.. కమిటీ ఏర్పాటుకు విజ్ఞప్తి
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి (టి.జె.ఎస్) పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అరికిల్ల భానుచందర్, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి లు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి వేడుకలు సరైన ఉత్సవ కమిటీ లేకుండా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని.పేర్కొన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అపారమని, అలాంటి మహనీయుని జయంతి వేడుకలను గౌరవప్రదంగా, ఘనంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి వేడుకలకు ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీఆధ్వర్యంలో సమగ్రంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు.


