Tirupati: పిల్లలు చదివే స్కూలా? పశువుల పాకనా? కోట పోలూరులో అధికారుల నిర్లక్ష్యం!
Tirupati: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోట పోలూరు అంగన్‌వాడీ కేంద్రం పశువుల పాకగా మారింది. పాఠశాల ఆవరణలో పశువులను కట్టేయడంపై గ్రామస్తుల ఆవేదన.
Tirupati: పిల్లలు చదివే స్కూలా? పశువుల పాకనా? కోట పోలూరులో అధికారుల నిర్లక్ష్యం!
తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట మండలం కోట పోలూరు పంచాయతీ తూర్పు హరిజనవాడ నందు ఉన్న అంగన్వాడి స్కూల్ నందు పశువులు, పశువులకు గడ్డి తో దర్శనమిస్తుంది. చిన్నపిల్లలు చదువె స్కూల్ నందు ఇలా పశువులను కట్టేసి, గడ్డిని నిల్వ ఉంచడం ఎంతవరకు సమంజసం అని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసిన అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారని అంగన్వాడీలో చదివే చిన్నపిల్లలు అనారోగ్య పాలు అవడానికి ఇలా పశువులను కట్టేయడం కూడా కారణమవుతుందని మా గ్రామం లోని అంగన్వాడి పై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా అంగన్వాడీలలో ఇలాంటి చర్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం వహించడం మానేసి మా అంగన్వాడీకి ఇలాంటి పరిస్థితుల నుండి విముక్తి కలిగించాలని లేకపోతే ఈ సమస్యపై గ్రామ ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందని ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.




