Srikakulam: క్యాన్సర్‌తో పోరాటం.. ఆరుగురి ఆధారం.. సుందరరావును ఆదుకోండి!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బి.గొనపపుట్టుగా గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు సుందరరావుకు సిక్కోలు ఉద్దానం సేవా సమితి ₹10,000 ఆర్థిక సాయం అందించింది.
Srikakulam: క్యాన్సర్‌తో పోరాటం.. ఆరుగురి ఆధారం.. సుందరరావును ఆదుకోండి!
Srikakulam: సిక్కోలు ఉద్దానం సేవా సమితి ఆధ్వర్యములో 10000 రూపాయలు ఆర్థిక సహాయం ఒకరి ప్రాణం ఆరుగురికి ఆధారం మీ సహాయం కోసం ఎదురుచూపుతో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బి.గొనపపుట్టుగా గ్రామానికి చెందిన సుందరరావు ప్రస్తుతం ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు రోజువారి కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సుందరరావు ఇప్పుడు మంచానికీ పరిమితమయ్యాడు భర్తను కోల్పోయిన అక్క తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మొత్తం కుటుంబం సుందరరావు మీదే ఆధారపడి ఉంది దయచేసి నన్ను నా ఫామిలీ ని దాతలు కాపాడండి అంటూ సుందరరావు వేడుకుంటున్నడు విష్యం తెలిసికొన్న సిక్కోలు ఉద్దానం సేవా సమితి వారు వెంటనే స్పందించి 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది మిగిలిన స్వచ్చంధ సేవా సంస్థలు కూడా సుందరరావు కుటంబాన్ని ఆదుకుంటారు అని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమములో సేవా సమితి సభ్యులు రంజిత్. జానూ. లక్ష్మి. దేవేంద్ర. రాంబాబు. జయబాబు. మాజీ సర్పంచ్ బద్రి ప్రకాష్ గ్రామస్తులు పాల్గున్నారు.




