Karimnagar: చాకుంట గ్రామ పంచాయతీకి కొత్త కళ: భవన నిర్మాణ పనుల ప్రారంభం
Karimnagar: కరీంనగర్ జిల్లా చాకుంట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ.
Karimnagar: చాకుంట గ్రామ పంచాయతీకి కొత్త కళ: భవన నిర్మాణ పనుల ప్రారంభం
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో గ్రామ అభివృద్ధికి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ పురం మాధవి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అవసరమైన పరిపాలనా సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని నాయకులు తెలిపారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పెరుమండ్ల గంగయ్య గౌడ్ హాజరై పాల్గొన్నారు అలాగే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Next Story




