Nandyala: హైవే బాటసారులకు ఊరట.. తమ్మరాజుపల్లెలో చలివేంద్రం ప్రారంభం!
Nandyala: నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె హైవే వద్ద నూతన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ప్రారంభించారు.
Nandyala: హైవే బాటసారులకు ఊరట.. తమ్మరాజుపల్లెలో చలివేంద్రం ప్రారంభం!
పాణ్యం మండలం: తమ్మరాజుపల్లె గ్రామంలో హైవే పక్కన ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ చలివేంద్రాన్ని తమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన కీ.శే హోటల్ శ్రీను కుమారుడు కార్తీక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మండుతున్న ఎండల మధ్య ప్రయాణికులు, పేద ప్రజలు చల్లని తాగునీటిని పొందేలా ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాణ్యం మండల నాయకులు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




