Municipal Workers: మున్సిపల్ కార్మికుల ముట్టడి.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత!

Municipal Workers: మున్సిపల్ కార్మికుల 'చలో కలెక్టరేట్'. పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని, సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 12:45 PM IST
Municipal Workers
X

Municipal Workers: మున్సిపల్ కార్మికుల ముట్టడి.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత!

Municipal Workers: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు.. అహర్నిశలు నగర పారిశుద్ధ్యం కై పనిచేసే తమ జీవితాల్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ జీతాలు పెంచి, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు ..12వ పిఆర్సీ ని వెంటనే ఏర్పాటు చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, సమ్మె కాలం జీతం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, 62 సంవత్సరాలకు వయోపరిమితిని పెంచాలని, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటీయు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు.

ఈ కార్యక్రమంలో.. గౌరవ జిల్లా అధ్యక్షులు పెంచల నరసయ్య, జిల్లా కార్యదర్శి ఆర్. ఎమ్ సునీల్ కుమార్, అధ్యక్షులు వజ్రమ్మ, నగర అధ్యక్షుడు సిహెచ్ మనోజ్, నగర కార్యదర్శి ఎం. అశోక్, రూరల్ అధ్యక్షురాలు సిహెచ్ సుజాతమ్మ, సిఐటియు రూరల్ అధ్యక్షులు సుధాకర్, లోకేష్ లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story