Nellore: నెల్లూరులో పూలే జయంతి సందడి.. నివాళులర్పించిన ఎంపీ బీద మస్తాన్ రావు
Nellore: నెల్లూరు బాలాజీ నగర్ సెంటర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Nellore: నెల్లూరులో పూలే జయంతి సందడి.. నివాళులర్పించిన ఎంపీ బీద మస్తాన్ రావు
Nellore: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పూలే బొమ్మ కూడలి వద్ద పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, పలువురు బీసీ సంఘం నాయకులు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..
మహాత్మ జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక సంస్కర్తగా, కుల వ్యతిరేక ఉద్యమకారుడుగా పనిచేశాడని గుర్తు చేశారు.
అంటరానితనం నిర్మూలనకు కృషి చేశాడని, మహిళల విద్యాభివృద్ధికి అంటరానితనం నిర్మూలనకు పాటుపడ్డాడని కొని ఆడారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప పోరాటయోధుడని గుర్తు చేశారు. ఆయన రచనలు సైతం ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చాయని చెప్పారు. ఆయన నేటి యువతరానికి భావి భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిని నేతలు చెప్పుకొచ్చారు.




