Nellore: గూడూరులో చేనేత కార్మికులకు భరోసా మగ్గాలను పరిశీలించిన ఎమ్మెల్యే
Nellore: గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చెన్నూరు గ్రామంలో పర్యటించి చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని వివరించారు.
Nellore: గూడూరులో చేనేత కార్మికులకు భరోసా మగ్గాలను పరిశీలించిన ఎమ్మెల్యే
Nellore: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పర్యటించారు పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు అలాగే మగ్గాలను పరిశీలించారు ఉచిత విద్యుత్ గురించి వివరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయంలో చేనేతలు ఎంతో సహకారం అందించారని మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు నేటి నుండి 200 లోపు యూనిట్లు ఉచితంగా ఇస్తుందని మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు విద్యుత్ మీటర్లు మృతి చెందిన పెద్దల పేరుతో ఉన్నాయని పలువురు చేనేతలు తెలియజేసారని విద్యుత్ అధికారులతో మాట్లాడామని ఆ సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు ఎవరైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకొని ఉంటే వాటి రసీదులు ఎమ్మెల్యే కార్యాలయంలో అందిస్తే సీఎం సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ,కరుణాకర్ రెడ్డి ,మట్టం శ్రావణి లీలావతి, తదితరులు పాల్గొన్నారు.




