Kukatpally: ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ విద్య.. కూకట్‌పల్లిలో కొత్త భవన ఆవిష్కరణ

Kukatpally: కూకట్‌పల్లిలో రూ. 8 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

MARUTI SAGAR, KUKATPALLY
Published on: 9 April 2026 3:24 PM IST
Kukatpally
X

Kukatpally: ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ విద్య.. కూకట్‌పల్లిలో కొత్త భవన ఆవిష్కరణ

కూకట్ పల్లి: కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై భవనాన్ని ప్రారంభించారు. జిల్లా అధికారులు, కళాశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్థుల కోసం రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ఈ నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీగా నిలిచేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రానికి, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు.

MARUTI SAGAR, KUKATPALLY

MARUTI SAGAR, KUKATPALLY

Next Story