Nalgonda: మాన్యచెల్కలో హెల్త్ సెంటర్ ప్రారంభం -మంత్రి కోమటిరెడ్డి
Nalgonda: నల్లగొండ మాన్యచెల్కలో రూ. 1.91 కోట్లతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Nalgonda: మాన్యచెల్కలో హెల్త్ సెంటర్ ప్రారంభం -మంత్రి కోమటిరెడ్డి
Nalgonda: నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మాన్యచెల్కలో రూ. 1.91 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ కేంద్రం స్థానిక ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Next Story


