Kurnool: ప్రాణం తీసిన నిర్లక్ష్యం? కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

Kurnool: కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వెంకట రమణ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆరోపణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 9 April 2026 12:19 PM IST
Kurnool
X

Kurnool: ప్రాణం తీసిన నిర్లక్ష్యం? కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

కర్నూలు జిల్లా: కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం.. ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఏ. వెంకట రమణ రెడ్డి (69) మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపణ.. మృతి చెందిన రమణారెడ్డికి ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం అందించారని బంధువుల ఆరోపణ.. సీనియర్ డాక్టర్ లేకపోవడంతో జుడాతో ఆపరేషన్ చేయించారని ఆపరేషన్ ఎవరు చేశారు అనే క్లారిటీ లేదని మండిపాటు.. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన తరువాత పేషేంట్ ఎలా మరణించాడని బంధువులు ఆందోళన.. ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్.. హాస్పిటల్ బంద్ చెయ్యాలని బంధువులు ఆందోళన.. చికిత్స కోసం వచ్చిన రోగిని వైద్యుల నిర్లక్ష్యం బలి తీసుకుందంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన పది నిముషాలకే వ్యక్తి చనిపోయాడని వైద్యులు ఎలా చెబుతారని మండిపడ్డారు.. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే శవమై రావడంపై అనేక అనుమానాలు.. "సినిమా ఫక్కీలో చనిపోయిన వ్యక్తికి ఆపరేషన్ చేసి మమ్మల్ని మోసం చేశారంటూ ఆరోపణలు.. అనుభవజ్ఞులైన డాక్టర్లు కాకుండా, జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించి మా మనిషిని చంపేశారు." అని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. కిమ్స్ యాజమాన్యంపై, బాధ్యులైన వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆసుపత్రి ముందు భీష్మించుకుని కూర్చున్నారు.. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద భారీగా బంధువులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story