Medak: ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన మెదక్ కాంగ్రెస్ నేతలు
Medak: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Medak: ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన మెదక్ కాంగ్రెస్ నేతలు
నర్సాపూర్ మెదక్ జిల్లా: హైదరాబాద్ ఓ ప్రైవేట్ హోటల్ లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లతుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. రాజ్యసభలో తెలంగాణ వాణీని మరింత బలంగా వినిపించి తెలంగాణ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కావాలని కోరారు.
Next Story




