Kakinada: అతివేగమే శాపమైంది! బ్రౌన్ పేట శివారులో వ్యక్తిని ఢీకొన్న వ్యాన్

Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రౌన్ పేట వద్ద బొలెరో వ్యాన్ ఢీకొని పేకేటి బ్రహ్మం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 4 April 2026 1:42 PM IST
Kakinada
X

Kakinada: అతివేగమే శాపమైంది! బ్రౌన్ పేట శివారులో వ్యక్తిని ఢీకొన్న వ్యాన్

కాకినాడ జిల్లా: సామర్లకోట పిఠాపురం రోడ్డు బ్రౌన్ పేట శివారు పెట్రోల్ బంక్ సమీపన బొలెరో వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఉప్పు వారు వీధి ప్రాంతానికి చెందిన పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి పిఠాపురం రోడ్ లో ఉన్న పశువులు పాకలో ఆవులకు దానా పట్టుకుని వెళ్తున్న సమయంలో బొలెరో వ్యాన్ అతి వేగంగా వచ్చి వెనకనుంచి ఢీకొట్టడంతో బ్రహ్మం కు తీవ్ర గాయాలు అయ్యారు. స్థానికులు సహకారంతో ప్రమాదానికి కారణమైన వ్యాన్ లో సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story