Kadapa: ఆసుపత్రిలోనే వ్యక్తి దారుణ హత్య.. కడపలో హై అలర్ట్!

Kadapa: కడప రిమ్స్ ఆసుపత్రిలో దారుణ హత్య. ఆలంఖాన్ పల్లె జాతరలో మొదలైన వివాదం చివరకు రిమ్స్ ప్రాంగణంలోనే పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్యకు దారితీసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 10:35 AM IST
Kadapa
X

Kadapa: ఆసుపత్రిలోనే వ్యక్తి దారుణ హత్య.. కడపలో హై అలర్ట్!

కడప: రిమ్స్ లో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్య.. ఆలంఖాన్ పల్లె లో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ. గాయాలతో చికిత్స కోసం వచ్చిన ఓ వర్గం పై రిమ్స్ ప్రాంగణంలోనే కత్తులతో దాడిచేయడంతోపెద్ద దస్తగిరి అనే వ్యక్తి మృతి చెందగా చిన్న సిద్దయ్య, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆలంఖాన్ పల్లె లో జరిగిన గంగమ్మ జాతరలో డీజే డాన్స్ వద్ద రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ.. ఒకరినొకరు కవ్వించుకుంటూ పరస్పర దాడులు. దాడిలో గాయపడిన పెద్ద దస్తగిరి, చిన్న సిద్ధయ్యలు చికిత్స కోసం వెళ్లిన సందర్భంలో మళ్లీ దాడి.. రిమ్స్ ప్రాంగణంలోనే మళ్ళీ జరిపిన దాడిలో మృతి చెందిన పెద్ద దస్తగిరి.. దర్యాప్తు చేస్తున్న కడప తాలుకా, రిమ్స్ పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story