Jukkal: అకాల వర్షం దెబ్బ జొన్న.. మొక్కజొన్న రైతులకు కన్నీరు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది.
Jukkal: అకాల వర్షం దెబ్బ జొన్న.. మొక్కజొన్న రైతులకు కన్నీరు!
జుక్కల్ (కామారెడ్డి): అకాల వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం తెల్ల వారు జాము నుండి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఉదయం 7 గంటల వరకు కురిసిన వర్షానికి చేతికొచ్చిన జొన్న, మొక్క జొన్న, గోధుమ పంటలకు నష్టం వాటిల్లు తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం తలపించేలా వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంకో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story




