Mahimaluru: ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: విద్యార్థులకు కంచి పరమేశ్వర్ రెడ్డి పిలుపు

Mahimaluru: మహిమలూరు ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 12:31 PM IST
Mahimaluru
X

Mahimaluru: ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: విద్యార్థులకు కంచి పరమేశ్వర్ రెడ్డి పిలుపు

మహిమలూరు: మహిమలూరు గ్రామంలోని ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మెయిన్ లో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవానికి విశిష్టా ఆధితులుగా సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర్ రెడ్డి ఆత్మకూరు మండల అధ్యక్షులు కేతా వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.ముఖ్య అతిథులుగా జిల్లా అధికారులు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ బాబు,అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉర్దూ విభాగం కరీంఖాన్ హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు షేక్ ఇస్మాయిల్ అధ్యక్షతన వార్షికోత్సవం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తులుగా ఉన్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అవరోదించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన పలువురు విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో విజయం సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story