Karimnagar: పొలానికి వెళ్తుండగా మృత్యువు కబళించింది వెదిర గ్రామంలో విషాదం!
Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన రైతు తొరికొండ నారాయణ (70) జగిత్యాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Karimnagar: పొలానికి వెళ్తుండగా మృత్యువు కబళించింది వెదిర గ్రామంలో విషాదం!
Karimnagar: కరీంనగర్ జిల్లా జగిత్యాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు తొరికొండ నారాయణ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాల ప్రకారం, నారాయణ తన సైకిల్ పై పంట పొలానికి నీళ్లు పెట్టడానికి రోడ్డు దాటుతున్న సమయంలో జగిత్యాల వైపు నుంచి అధిక వేగంతో వస్తున్న కారు అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనా స్థలంలో తీవ్ర గాయాలపాలైన నారాయణ అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందగానే రామడుగు ఎస్ఐ రాజు నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story




