Kamareddy: బిచ్కుంద జాబ్ మేళా సక్సెస్ 31 మందికి ఉద్యోగాలు
Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది.
Kamareddy: బిచ్కుంద జాబ్ మేళా సక్సెస్ 31 మందికి ఉద్యోగాలు
బిచ్డికుంద (కామారెడ్డి): డిగ్రి కళాశాల (అటానమస్) బిచ్కుంద లో గురువారం ఐ.క్యూ.ఎ.సి మరియు ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్థానిక విద్యార్థుల తో పాటు నియోజకవర్గంలో ని నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధి బాలకృష్ణ హెచ్. ఆర్. మేనేజర్, శ్రీ విజయ బయో ఫార్మా కంపెనీ ప్రతినిధి నరేష్ పాల్గొని విద్యార్థులతో ఇంటర్వ్యూ నిర్వహించి జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.కళాశాల ప్రిన్సిపల్ కె .అశోక్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులకు విద్య మాత్రమే సరిపోదు దానికి తోడు సరైన అవకాశాలు మార్గదర్శనం కూడా అవసరమని మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా సంస్థల ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని ఎంపికైన విద్యార్థుల కు అభినందనలు తెలియజేశారు. నిర్వాహకులకు ప్రశంసించారు. ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డా.టి.అశోక్ రావు మాట్లాడుతూ 130 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అందులో 31మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ఐ. క్యు.ఏ.సి కోఆర్డినేటర్ డాక్టర్ జి.రమేష్ బాబు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


