Atmakur: అమరావతికి పార్లమెంట్ ఆమోదం.. చారిత్రాత్మక విజయం నలిశెట్టి శ్రీధర్
Atmakur: అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించడంపై జనసేన ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.
Atmakur: అమరావతికి పార్లమెంట్ ఆమోదం.. చారిత్రాత్మక విజయం నలిశెట్టి శ్రీధర్
Atmakur: పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం లభించడం ఎంతో హర్షించదగ్గ విషయమని జనసేన ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంలో జనసేన నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ప్రధాని నరేంద్ర మోడీ సహకారం ఉందన్నారు. రాజ్యాల బాగుకోసం రాజులు చేసిన యాగాలను భగ్నం చేసేందుకు ఆనాడు రాక్షసులు కుట్ర పన్నేవారన్నారు. అదే పరంపరలో ఈనాటి వైసిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపిన జగన్ 2019 అధికారం తర్వాత మాట మార్చి మూడు రాజధానుల రాగం అందుకున్నారన్నారు. ప్రజలు జగన్ కుట్రలలో గమనిస్తున్నారని తెలిపారు.




