Parvathipuram: బుడగరాయి ఆశ్రమ పాఠశాలలో పీవో పవార్ స్వప్నిల్ మెరుపు తనిఖీ!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం బుడగరాయి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ ఆకస్మిక తనిఖీ.
Parvathipuram: బుడగరాయి ఆశ్రమ పాఠశాలలో పీవో పవార్ స్వప్నిల్ మెరుపు తనిఖీ!
Parvathipuram: సీతంపేట మండలం బుడగరాయి ఆశ్రమ పాఠశాలను ఐటిడిఎ పీవో పవార్ స్వప్నిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ వార్డెన్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు
ఈ సందర్భంగా భోజనం నాణ్యతను పరిశీలించి, రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ లో సరుకులను పరిశీలించి పండ్లు లేకపోవడంపై ప్రశ్నించారు. రికార్డ్స్ పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జి చిన్నబాబు పాల్గొన్నారు.
Next Story


