Kondagattu: భక్తులతో పోటెత్తిన కొండగట్టు.. అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ!
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
Kondagattu: భక్తులతో పోటెత్తిన కొండగట్టు.. అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ!
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది.
Next Story




