Sri Sathya Sai: టీచర్ల ఆవేదన.. ఫ్యాప్టో గర్జన! రేపటి నుంచి జిల్లాలో నిరసనల పర్వం

Sri Sathya Sai: నల్లబ్యాడ్జీలతో విధులకు.. 9న స్పాట్ కేంద్రాల వద్ద నిరసన. ఫ్యాప్టో నేతలు హరి ప్రసాద్ రెడ్డి, గౌస్ లాజమ్ కీలక ప్రకటన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 12:03 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: టీచర్ల ఆవేదన.. ఫ్యాప్టో గర్జన! రేపటి నుంచి జిల్లాలో నిరసనల పర్వం

ఓ.డి.చెరువు: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా చైర్మన్ గజ్జల హరి ప్రసాద్ రెడ్డి, సెక్రటరీ జనరల్ కట్టుబడి గౌస్ లాజమ్ ప్రకటనలో తెలిపారు. పీఆర్సీపై కమిటీ ఛైర్మన్ ను నియమించలేదన్నారు. 30 శాతం ఐ.ఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల కామన్ సర్వీస్ రూల్స్ పరిష్కరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పదో తరగతి మూల్యాంకనానికి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయిం చారు. 9న స్పాట్ కేంద్రం వద్ద నిరసన చేపట్టాలని తీర్మానించారు. 25, 26, 27 తేదీల్లో నిరాహారదీక్షలు చేపడతారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలు విడుదల చేయాలని.. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి మెమో 57 ప్రకారం 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం అమలు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాలకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story