Sri Sathya Sai: క్రీస్తు త్యాగానికి నివాళి.. ఓడి చెరువులో ఈస్టర్ ప్రార్థనల కోలాహలం
Sri Sathya Sai: ఓడి చెరువు మండల కేంద్రంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. సి అండ్ ఐ జి మిషన్ చర్చిలో పునరుత్థాన ప్రార్థనలు. పాస్టర్ డాక్టర్ ఎం.జి. జయానందం సందేశం.
Sri Sathya Sai: క్రీస్తు త్యాగానికి నివాళి.. ఓడి చెరువులో ఈస్టర్ ప్రార్థనల కోలాహలం
శ్రీ సత్య సాయి (ఓడి చెరువు): యేసు క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చిలో క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిని పూలతో అలంకరించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు లేచెను.. ఆదివరమున, జయ జయ యేసు జయ యేసు.. అంటూ ఈస్టర్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. పాస్టర్ డాక్టర్ ఎం జి జయానందం ఈస్టర్ ప్రత్యేకతను వివరించారు. గుడ్ ఫ్రైడే రోజు ఏడు మాటల గురించి ధ్యానించిన వారికి బహుమతులు అందజేశారు.
Next Story




