Annamayya: పాము కుట్టినా పరీక్ష ఆగలేదు మదనపల్లె విద్యార్థిని వీరగాథ!

Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం. పదో తరగతి పరీక్ష రాస్తుండగా విద్యార్థిని అఫ్రన్‌ను పాము కరిచింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 March 2026 8:26 AM IST
Annamayya
X

Annamayya: పాము కుట్టినా పరీక్ష ఆగలేదు మదనపల్లె విద్యార్థిని వీరగాథ!

Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బసినికొండకు చెందిన అఫ్రన్ అనే విద్యార్థిని, శనివారం జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెను పాము కరిచింది. సాధారణంగా ఎవరైనా భయంతో కేకలు వేస్తారు.. కానీ అఫ్రన్ మాత్రం నాకేం కాలేదు అంటూ ఇన్విజిలేటర్‌కు చెప్పి, మొక్కవోని దీక్షతో పరీక్షను పూర్తి చేసింది. పరీక్ష ముగిసిన వెంటనే సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఫ్రన్ క్షేమంగానే ఉందని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదువుపై ఆ అమ్మాయికి ఉన్న అంకితభావాన్ని చూసి స్థానికులు, విద్యాశాఖ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story