Nellore: ఉదయగిరిలో బీజేపీ జెండా పండుగ ఆవిర్భావ వేడుకల్లో నినాదాల హోరు!

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 1:57 PM IST
Nellore
X

Nellore: ఉదయగిరిలో బీజేపీ జెండా పండుగ ఆవిర్భావ వేడుకల్లో నినాదాల హోరు!

నెల్లూరు జిల్లా: ఉదయగిరి బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయగిరిలో సోమవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, వందే మాతరం, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలతో ప్రాంతం మార్మోగింది.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ ఆవిర్భావం నుంచి దేశ అభివృద్ధి దిశగా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, పారదర్శక పాలన అందిస్తున్న బీజేపీపై ప్రజలకు విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, యువకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story