Amaravati: బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

Amaravati: బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష. బీసీ రక్షణ చట్టం, రాజధానిలో 1000 ఎకరాల భూమి, మరియు 44 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో నాలుగు రోజుల పోరాటం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 1:44 PM IST
Amaravati
X

Amaravati: బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

Amaravati: వాళ్ల జెండాలు ఎత్తుకొని వాళ్లకు జిందాబాద్ కొడుతూ వాళ్లకి అధికారం మనం ఇచ్చి వాళ్ళచేతుల్లో మనం దోపిడీకి దాడులకి గురై బానిసలుగా మారి, మన హక్కులను సాధించుకోలేక అన్నగారి పోతున్నాం ఇంకెన్నాళ్లు.. ఈ బానిసత్వం ఇకనైనా మారుదాం.. కదిలిరండి ఓ బీసీ సమాజమా.. అంటూ పిలుపునిచ్చారు బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్.

నాయకుడు మనవాడే, జెండా మనదే, పోరాటం మనదే, ఫలితం మనది, మన హక్కుల కోసం పోరాడుదాం అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు బీసీ నేతలు.. ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ చేయి చేయి కలిపి మన హక్కులు సాధించుకుందాం, మన హక్కులు అడుక్కోవడం కాదు, పోరాడి సాధించుకుందాం అంటూ పిలుపునిచ్చారు రామచంద్ర యాదవ్.

ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు జరగాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.. అదే విధంగా సమగ్ర కుల గణన జరగాలని, విద్యా, ఉద్యోగాలు ,స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. నాలుగు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు బిసివై అధినేత రామచంద్ర యాదవ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story