Pathapatnam: బాలల భద్రతపై రాజీ లేదు! పాతపట్నంలో రాష్ట్ర కమిషన్ పర్యటన!

Pathapatnam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పాతపట్నం, హిరమండలంలో పర్యటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 12:02 PM IST
Pathapatnam
X

Pathapatnam: బాలల భద్రతపై రాజీ లేదు! పాతపట్నంలో రాష్ట్ర కమిషన్ పర్యటన!

పాతపట్నం: బాలల భద్రత, హక్కుల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం జిల్లాలో పర్యటించిన కమిషన్ హిరమండలం, పాతపట్నం ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించిన కమిషన్ సభ్యులు డాక్టర్ పి. నాగమానస, సి.హెచ్. మధుసూదనరావు, గంగా సూర్యనారాయణలు శుక్రవారం జిల్లాలోని పాతపట్నం, హిరమండలం ప్రాంతాల్లో పర్యటించిన సభ్యులు, తొలుత హిరమండలంలో అత్యాచారానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా కమిషన్ తరపున ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం పాతపట్నం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి, ఇటీవల ప్రమాదవశాత్తు రైలింగ్‌పై నుండి కిందపడి మరణించిన 7వ తరగతి విద్యార్థిని పూజిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story